మంగళవారం 31 మార్చి 2020
National - Mar 21, 2020 , 12:27:29

పశ్చిమబెంగాల్‌లో కరోనా మూడవ పాజిటివ్‌ కేసు

పశ్చిమబెంగాల్‌లో కరోనా మూడవ పాజిటివ్‌ కేసు

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో కరోనా వైరస్‌ మూడవ పాజిటివ్‌ కేసు నమోదైంది. స్కాంట్లాండ్‌ నుంచి రాష్ర్టానికి వచ్చిన మహిళకు నావల్‌ కరోనా వైరస్‌ పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు నేడు అధికారికంగా ధృవీకరించారు. 20 ఏళ్ల వయస్సున్న యువతి స్కాట్లాండ్‌ నుంచి మార్చి 16న రాష్ర్టానికి వచ్చింది. కోవిడ్‌-19 లక్షణాలతో సదరు యువతి బెలియాఘాట్‌ ఐడీ ఆస్పత్రిలో చేరింది. యువతి నార్త్‌ 24 పరగణాస్‌ జిల్లాలోని హబ్రా ప్రాంత నివాసి. కాగా విదేశాల నుంచి వచ్చిన తర్వాత యువతి హోం క్వారంటైన్‌ అయిందా కాలేదా అన్న విషయం తెలియాల్సి ఉందన్నారు. అంతకుక్రితం విదేశాల నుంచి వచ్చిన ఇద్దరికి సైతం కరోనా వైరస్‌ పాజిటివ్‌గా తేలింది. 

అదేవిధంగా కోల్‌కతాలోని బల్లేగంగా ప్రాంతంలో హోం క్వారంటైన్‌ గైడ్‌లైన్స్‌ పాటించని మరో ఇద్దరి మహిళలను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఇరువురు ఇటీవలే విదేశాల నుంచి తిరిగి వచ్చారు. విదేశాల నుంచి వచ్చిన వారు 14 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా పశ్చిమబెంగాల్‌ వైద్యారోగ్యశాఖ విభాగం పౌరులకు విజ్ఞప్తి చేసింది. యూకే, యూఎస్‌ఏ, యూరోప్‌, గల్ఫ్‌ దేశాల నుంచి వచ్చిన వారు తప్పనిసరిగా 14 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా పేర్కొంది.


logo
>>>>>>