మంగళవారం 07 జూలై 2020
National - Jun 28, 2020 , 20:56:06

బెంగాల్‌లో 572 కరోనా పాజిటివ్‌ కేసులు

బెంగాల్‌లో 572 కరోనా పాజిటివ్‌ కేసులు

కొల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో కరోనా పంజా విసురుతున్నది. రోజు రోజుకు పాజిటివ్‌ కేసులు సంఖ్య పెరుగుతున్నది. ఆదివారం కొత్తగా మరో 572 పాజిటివ్‌ కేసులు నమోదవగా, 10 మంది మరణించారు. ఇప్పటి వరకు కేసుల సంఖ్య 17,283కు చేరాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఇవాళ 404 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారని, రాష్ట్రంలో డిశ్చార్జి రేటు 64.76 శాతంగా నమోదైనట్లు వివరించింది. కాగా, దేశంలో ఇవాళ ఒక్క రోజే అత్యధికంగా 19,906 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ పేర్కొంది. 24 గంటల్లో 410 మంది మరణించగా, మొత్తం మరణాల సంఖ్య 16,095కి చేరింది. దేశంలో 5,28,859 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 2,03,051 మంది చికిత్స పొందుతుండగా, 3,09,713 మంది కోలుకున్నట్లు వివరించింది.


logo