శుక్రవారం 03 జూలై 2020
National - May 29, 2020 , 12:06:21

అగ్నిమాపక శాఖ మంత్రికి కరోనా

అగ్నిమాపక శాఖ మంత్రికి కరోనా

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ రాష్ట్ర అగ్నిమాపక శాఖ మంత్రి సుజిత్‌ బోస్‌ కరోనా పాజిటివ్‌గా తేలారు. కరోనా లక్షణాలు కనిపించడంతో సుజిత్‌ బోస్‌, అతని భార్యకు గురువారం రాత్రి పరీక్షలు నిర్వహించారు. అందులో వారికి పాజిటివ్‌ అని వచ్చింది. దీంతో వారిద్దరిని స్వీయ నిర్బంధంలో ఉండాల్సిందిగా వైద్యులు సూచించారు. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆయన గత కొన్నిరోజులుగా రాష్ట్రంలో వలసకార్మికుల తరలింపు, అంఫాన్‌ సహాయక చర్యల్లో భాగంగా ఆయన క్షేత్రస్థాయిలో చురుకుగా పనిచేస్తున్నారు. సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని మంత్రిమండలిలో కరోనా బారిన పడిన మొదటి మంత్రిగా ఆయన నిలిచారు. 

పశ్చిమబెంగాల్‌లో ఇప్పటివరకు 4,536 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవగా, 223 మంది మరణించారు. గత 24 గంటల్లో 334 కరోనా కేసులు నమోదవగా, ఆరుగురు మృతిచెందారు.  


logo