ఆదివారం 29 మార్చి 2020
National - Feb 27, 2020 , 02:10:59

ఎంపీ హీరోయిన్‌.. మంత్రి డైరెక్షన్‌

ఎంపీ హీరోయిన్‌.. మంత్రి డైరెక్షన్‌

కోల్‌కతా, ఫిబ్రవరి 26: పశ్చిమబెంగాల్‌ మంత్రి బ్రత్యా బసు తన బిజీ షెడ్యూల్‌ నుంచి కాస్త విరామం తీసుకుని ఒక సినిమాను తెరకెక్కిస్తున్నారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ నుస్రత్‌ జహాన్‌ ఇందులో హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాకు ‘డిక్షనరీ’ అని పేరుపెట్టారు. మానవ సంబంధాల్లో ఏర్పడుతున్న అంతరాల గురించి ఈ సినిమాలో చర్చించనున్నట్లు బసు తెలిపారు. బుద్ధదేవ్‌ గుహ రచించిన రెండు లఘుకథలను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. థియేటర్‌ ఆర్టిస్ట్‌గా పేరుపొందిన బసు దాదాపు 30 బెంగాలీ సినిమాల్లో నటించారు. 2010లో ఆయన తారా అనే సినిమాకు దర్శకత్వం వహించారు. అనంతరం తృణమూల్‌లో చేరిన ఆయన మమత క్యాబినెట్‌లో చోటుదక్కించుకున్నారు. ఇక గతేడాదే రాజకీయాల్లోకి ప్రవేశించిన నుస్రత్‌ జహాన్‌.. తృణమూల్‌ కాంగ్రెస్‌ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. బసుతో కలిసి పనిచేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానని, ఈ సినిమాతో ఆ కోరిక నెరవేరిందని నుస్రత్‌ తెలిపారు. ప్రముఖ బంగ్లాదేశీ నటుడు ముషారష్‌ కరీమ్‌ ఈ సినిమాలో ఒక కీలకపాత్ర పోషిస్తున్నారు.


logo