బుధవారం 27 మే 2020
National - May 14, 2020 , 15:58:20

బెంగాల్‌కు 105 శ్రామిక్ రైళ్లు వ‌స్తున్నాయి : మ‌మ‌తా బెన‌ర్జీ

బెంగాల్‌కు 105 శ్రామిక్ రైళ్లు వ‌స్తున్నాయి : మ‌మ‌తా బెన‌ర్జీ

హైద‌రాబాద్‌: ప‌శ్చిమ బెంగాల్ ప్ర‌భుత్వం 105 శ్రామిక్ రైళ్లు న‌డిపిస్తున్న‌ట్లు ఆ రాష్ట్ర సీఎం మ‌మతా బెన‌ర్జీ తెలిపారు.  వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న వ‌ల‌స కూలీల‌ను ఆ రైళ్ల ద్వారా తీసుకురానున్న‌ట్లు ఆమె చెప్పారు.  వ‌ల‌స కూలీల‌ను ఆదుకునే నిబద్ధ‌త త‌మ‌కు ఉన్న‌ద‌ని, అందుకే 105 రైళ్లు ఏర్పాటు చేసిన‌ట్లు సీఎం తెలిపారు.వివిధ రాష్ట్రాల నుంచి ప్ర‌త్యేక రైళ్ల ద్వారా కార్మికుల‌ను తీసుకురానున్న‌ట్లు ఆమె చెప్పారు. ఇత‌ర రాష్ట్రాల నుంచి బెంగాల్‌కు రైళ్ల‌ను రానివ్వ‌డం లేద‌ని రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయ‌ల్ ఆరోప‌ణ‌లు చేసిన నేప‌థ్యంలో.. దీదీ త‌న ట్విట్ట‌ర్ ద్వారా తాజా అంశంపై స్పందించారు. సీఎం మ‌మ‌తా బెన‌ర్జీకి కేంద్ర మంత్రి అమిత్ షా లేఖ రాసిన త‌ర్వాత కూడా ఎటువంటి మెరుగైన ప‌రిస్థితి ఏర్ప‌డ‌లేద‌ని పీయూష్ ఆరోపించారు. logo