గురువారం 09 జూలై 2020
National - May 29, 2020 , 18:38:41

బెంగాల్‌లో ప్రార్థ‌నా మందిరాల‌కు ప‌ర్మిష‌న్!‌

బెంగాల్‌లో ప్రార్థ‌నా మందిరాల‌కు ప‌ర్మిష‌న్!‌

కోల్‌క‌తా: కేంద్ర ప్ర‌భుత్వం విధించిన నాలుగో విడ‌త లాక్‌డౌన్ గ‌డువు ఆదివారంతో ముగియ‌నున్న‌ది. ఈ నేప‌థ్యంలో ప‌శ్చిమ‌బెంగాల్ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న లాక్‌డౌన్ నిబంధ‌న‌ల నుంచి ప్ర‌జ‌ల‌కు మ‌రికొన్ని స‌డ‌లింపులు ఇచ్చింది. రాష్ట్రంలోని ప్రార్థ‌నా మందిరాలైన దేవాల‌యాలు, మ‌సీదులు, గురుద్వారాలు, చ‌ర్చిల్లో ద‌ర్శ‌నాల‌ను పునఃప్రారంభించ‌నున్న‌ట్లు ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తాబెన‌ర్జీ ప్ర‌క‌టించారు. 

అయితే, రాష్ట్ర‌వ్యాప్తంగా ప్రార్థ‌నా మందిరాల‌ను తిరిగి ప్రారంభిస్తున్న‌ట్లు చేసిన ప్ర‌క‌ట‌న‌తోపాటే మ‌మ‌తా బెన‌ర్జీ కొన్ని ష‌ర‌తులు కూడా విధించారు. ఏ మ‌తానికి సంబంధించిన ప్రార్థ‌న మందిరం లోప‌లికి అయినా 10 మందికి వెళ్ల‌కూడ‌ద‌న్నారు. లోప‌లికి వెళ్లిన 10 మంది తిరిగి వ‌చ్చిన త‌ర్వాత‌నే మ‌రో 10 మంది వెళ్లాల‌ని సూచించారు. జూన్ 1 నుంచి తాజా స‌డ‌లింపులు అమ‌ల్లోకి వ‌స్తాయ‌ని సీఎం మ‌మ‌త స్ప‌ష్టం చేశారు. 


logo