బుధవారం 03 మార్చి 2021
National - Jan 22, 2021 , 13:17:20

బెంగాల్ మంత్రి రాజీవ్ బెన‌ర్జి రాజీనామా

బెంగాల్ మంత్రి రాజీవ్ బెన‌ర్జి రాజీనామా

కోల్‌క‌తా: ప‌శ్చిమ‌బెంగాల్‌లో అధికార తృణ‌మూల్ కాంగ్రెస్‌కు దెబ్బ‌మీద దెబ్బ త‌గులుతూనే ఉంది. ఓ వైపు అసెంబ్లీ ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతుంటే ఆ పార్టీకి చెందిన నేత‌లు ఒక‌రి త‌ర్వాత ఒక‌రు ప‌ద‌వుల‌ను పార్టీని వీడుతున్నారు. ఇప్ప‌టికే తృణ‌మూల్ కీల‌క నేతగా, మంత్రిగా ఉన్న సువేందు అ‌ధికారి తృణ‌మూల్‌ను వీడి బీజేపీలో చేరారు. ఆయ‌న త‌ర్వాత కూడా ప‌లువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు తృణ‌మూల్ కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పారు. తాజాగా వెస్ట్‌బెంగాల్ క్యాబినెట్‌లోని అటవీశాఖ‌ మంత్రి రాజీవ్ బెన‌ర్జి త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు.

ఈ మేర‌కు ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి మ‌మ‌తాబెన‌ర్జికి రాజీనామా లేఖ పంపించారు. బెంగాల్ రాష్ట్ర‌ ప్ర‌జ‌ల‌కు మంత్రిగా సేవ‌లందించ‌డం త‌న‌కు ఎంతో గ‌ర్వంగా ఉన్న‌ద‌ని ఆయ‌న త‌న రాజీనామా లేఖ‌లో పేర్కొన్నారు. త‌న‌కు మంత్రిగా అవ‌కాశం ఇచ్చినందుకు ముఖ్య‌మంత్రి మ‌మ‌తాబెన‌ర్జికి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. కానీ, త‌న రాజీనామాకు గ‌ల కార‌ణాన్ని మాత్రం రాజీవ్ బెన‌ర్జి ఆ లేఖ‌లో ప్ర‌స్తావించ‌లేదు.           

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo