మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 30, 2020 , 07:53:41

ప‌శ్చిమ‌బెంగాల్ పీసీసీ అధ్య‌క్షుడు మిత్రా మృతి

ప‌శ్చిమ‌బెంగాల్ పీసీసీ అధ్య‌క్షుడు మిత్రా మృతి

కోల్‌క‌తా: ప‌శ్చిమ‌బెంగాల్ కాంగ్రెస్ అధ్య‌క్షుడు సోమెన్ మిత్రా (78) క‌న్నుమూశారు. గ‌త కొంత‌కాలంగా వ‌య‌స్సు సంబంధిత అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న ఆయ‌న గురువారం తెల్ల‌వారుజామున 1.30 గంట‌ల‌కు కోల్‌క‌తాలోని సిటీ ద‌వాఖాన‌లో తుదిశ్వాస విడిచారు. ఆయ‌న‌కు భార్య‌, కొడుకు ఉన్నారు. 

కిడ్ని, గుండె సంబంధిత స‌మ‌స్య‌ల‌తో సోమెన్ మిత్రా కొన్ని రోజుల క్రితం ద‌వాఖాన‌లో చేరార‌ని, గురువారం తెల్ల‌వారుజామున గుండె పోటు రావ‌డంతో మ‌ర‌ణించార‌ని ఆయ‌న కుటుంబ‌స‌భ్యులు వెల్ల‌డించారు. క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా నెగెటివ్ వ‌చ్చింద‌ని తెలిపారు. 

బెంగాల్ రాజ‌కియాల్లో అపార అనుభ‌వ‌మున్న మిత్రా గ‌తంలో లోక్‌స‌భ ఎంపీగా కూడా ప‌నిచేశారు.  


logo