e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home జాతీయం బెంగాల్ డీజీపీగా వీరేంద్ర.. తిరిగి నియమించిన సీఎం మ‌మ‌త‌

బెంగాల్ డీజీపీగా వీరేంద్ర.. తిరిగి నియమించిన సీఎం మ‌మ‌త‌

బెంగాల్ డీజీపీగా వీరేంద్ర.. తిరిగి నియమించిన సీఎం మ‌మ‌త‌

కోల్‌క‌తా: ప‌శ్చిమ బెంగాల్ సీఎంగా మూడోసారి బుధ‌వారం ప్ర‌మాణ స్వీకారం చేసిన మ‌మ‌తా బెనర్జీ అనంత‌రం కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. ఐపీఎస్ అధికారి వీరేంద్రను బెంగాల్ డీజీపీగా తిరిగి నియమించారు. జావేద్ షమీమ్‌ను ఏజీపీ లా అండ్ ఆర్డర్‌గా తిరిగి నియమించారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఈసీ నియమించిన డీజీపీ నిరంజ‌య‌న్ పాండేను ఫైర్ అండ్‌ ఎమర్జెన్సీ సర్వీసెస్‌కు, ఏడీజీ లా అండ్ ఆర్డర్ జగ్ మోహన్‌ను సివిల్ డిఫెన్స్‌కు బ‌దిలీ చేశారు.

బెంగాల్‌లో హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల‌ను స‌హించ‌బోమ‌ని సీఎం మ‌మ‌త అన్నారు. బీజేపీ పాత వీడియోలను సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ చేసి హింస‌ను ప్రేరేపిస్తున్న‌ద‌ని ఆరోపించారు. ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఇలాంటివి చాలా చేశార‌ని, ఇక‌పై ఆపివేయాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ఐక్య‌త‌కు మారు పేరు బెంగాల్ అని మ‌మ‌త వెల్ల‌డించారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
బెంగాల్ డీజీపీగా వీరేంద్ర.. తిరిగి నియమించిన సీఎం మ‌మ‌త‌

ట్రెండింగ్‌

Advertisement