గురువారం 16 జూలై 2020
National - Jun 30, 2020 , 18:17:17

ఆ న‌గ‌రాల నుంచి విమానాలు వ‌ద్దు: ప‌శ్చిమ‌బెంగాల్

ఆ న‌గ‌రాల నుంచి విమానాలు వ‌ద్దు: ప‌శ్చిమ‌బెంగాల్

కోల్‌క‌తా: క‌రోనా మ‌హ‌మ్మారిని క‌ట్ట‌డి చేయ‌డం కోసం ప‌శ్చిమ‌బెంగాల్ ప్ర‌భుత్వం అన్ని ర‌కాల‌ ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ది. అయినా కేసుల సంఖ్య త‌గ్గ‌క‌పోవ‌డంతో రాష్ట్రంలోకి వచ్చిపోయే విమానాల నియంత్రణ‌పై దృష్టి సారించింది. క‌రోనా ప్ర‌భావం ఎక్కువ‌గా ఉన్న రాష్ట్రాల నుంచి బెంగాల్‌లోకి విమానాలు రాకుండా నిలువ‌రించాల‌ని నిర్ణ‌యించింది. ఈ మేర‌కు ప‌శ్చిమ‌బెంగాల్ ప్ర‌ధాన‌ కార్య‌ద‌ర్శి రాజీవ సిన్హా పౌర విమాన‌యాన మంత్రిత్వ శాఖ‌కు లేఖ రాశారు. 

రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి క‌ట్ట‌డి త‌గిన చ‌ర్య‌లు చేప‌డుతున్నామ‌ని, అయినా బ‌య‌టి రాష్ట్రాలు, దేశాల నుంచి విమానాలు, రైళ్ల ద్వారా వ‌చ్చే వారితో రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరిగిపోతున్న‌ద‌ని బెంగాల్ చీఫ్ సెక్ర‌ట‌రీ రాజీవ సిన్హా త‌న లేఖ‌లో పేర్కొన్నారు. అందువ‌ల్ల క‌రోనా ప్ర‌భావం ఎక్కువ‌గా ఉన్న ఢిల్లీ, ముంబై, పుణె, నాగ్‌పూర్‌, చెన్నై, ఇండోర్‌, అహ్మ‌దాబాద్‌, సూర‌త్ న‌గ‌రాల నుంచి ప‌శ్చిమ‌బెంగాల్‌కు జూలై 6వ తేదీ మొద‌లు రెండు వారాలపాటు విమానాల‌ను న‌డుప‌వ‌ద్ద‌ని కోరారు.     ‌logo