గురువారం 28 జనవరి 2021
National - Dec 21, 2020 , 14:40:49

బెంగాల్‌లో మరో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన బీజేపీ

బెంగాల్‌లో మరో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన బీజేపీ

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ రాజకీయాలపై దృష్టి సారించిన బీజేపీ మరో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించింది. దుర్గాపూర్‌లో ఏర్పాటు చేసిన పార్టీ కొత్త కార్యాలయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్, ఆ పార్టీ ఎంపీ అర్జున్ సింగ్ కలిసి సోమవారం ప్రారంభించారు. పశ్చిమ బెంగాల్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికారాన్ని సొంతం చేసుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతోపాలు పలువురు పార్టీ శ్రేణులు రాష్ట్రాన్ని తరచుగా సందర్శిస్తున్నారు. కేడర్‌ను బలోపేతం చేయడంతోపాటు టీఎంసీ నేతలను బీజేపీ వైపు ఆకట్టుకుంటున్నారు. దీంతో ఇటీవల టీఎంసీకి రాజీనామా చేసిన పలువురు ఎమ్మెల్యేలు, నేతలు అమిత్‌ షా రెండు రోజుల పర్యటన సందర్భంగా ఆయన సమక్షంలో బీజేపీలో చేరారు. పశ్చిమ బెంగాల్‌లో గత కొన్ని ఏండ్లుగా అధికార టీఎంసీ, బీజేపీ మధ్య నెలకొన్న రాజకీయ విభేదాలు ప్రస్తుతం తారాస్థాయికి చేరాయి. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo