e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Home News బెంగాల్ అల్ల‌ర్లు : స్పీక‌ర్ ఎన్నిక‌కు బీజేపీ దూరం!

బెంగాల్ అల్ల‌ర్లు : స్పీక‌ర్ ఎన్నిక‌కు బీజేపీ దూరం!

బెంగాల్ అల్ల‌ర్లు :  స్పీక‌ర్ ఎన్నిక‌కు బీజేపీ దూరం!

కోల్ క‌తా : ప‌శ్చిమ బెంగాల్ లో ఎన్నిక‌ల అనంత‌ర హింసాకాండ‌కు నిర‌స‌న‌గా బీజేపీ బెంగాల్ చీఫ్ దిలీప్ ఘోష్ నిర‌స‌న కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. బెంగాల్ అసెంబ్లీ స్పీక‌ర్ ఎన్నిక‌లో కాషాయ పార్టీ పాల్గొన‌ద‌ని, విధాన స‌భ స‌మావేశాల‌కు హాజ‌రు కాబోమ‌ని దిలీప్ ఘోష్ స్ప‌ష్టం చేశారు. ప్ర‌జ‌లు, బీజేపీ కార్య‌క‌ర్త‌ల‌కు భ‌ద్ర‌త క‌ల్పించే వ‌ర‌కూ త‌మ నిర‌స‌న‌లు కొన‌సాగుతాయ‌ని ఘోష్ పేర్కొన్నారు.

బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల అనంత‌రం చెల‌రేగిన అల్ల‌ర్ల‌లో తొమ్మిది మంది త‌మ పార్టీ కార్య‌క‌ర్త‌లు మ‌ర‌ణించార‌ని బీజేపీ ఆరోపిస్తుండ‌గా మొత్తం ప‌ద‌హారు మంది మ‌ర‌ణించార‌ని వీరిలో స‌గం టీఎంసీ కార్య‌క‌ర్త‌లేన‌ని ఆ పార్టీ అధినేత్రి, సీఎం మమ‌తా బెన‌ర్జీ పేర్కొన్నారు. ఇక కరోనా వైర‌స్ కేసులు పెరుగుతున్న క్ర‌మంలో బెంగాల్ కు స‌త్వ‌ర‌మే ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రాలు పెంచాల‌ని కోరుతూ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ లేఖ రాశారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
బెంగాల్ అల్ల‌ర్లు :  స్పీక‌ర్ ఎన్నిక‌కు బీజేపీ దూరం!

ట్రెండింగ్‌

Advertisement