బుధవారం 27 జనవరి 2021
National - Dec 24, 2020 , 15:26:42

పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల్లో వామపక్షాలతో కాంగ్రెస్‌ పొత్తు

పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల్లో వామపక్షాలతో కాంగ్రెస్‌ పొత్తు

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆ రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. కొత్త పొత్తులకు రాజకీయ పార్టీలు తెర తీస్తున్నాయి. త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్ష పార్టీలతో కలిసి పోటీ చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ తెలిపింది. ఆ పార్టీ బెంగాల్‌ అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌదరి ఈ మేరకు గురువారం ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. ‘పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో వామపక్షాలతో కలిసి ఎన్నికల కూటమిగా ఏర్పడేందుకు కాంగ్రెస్ హైకమాండ్ ఈ రోజు అధికారికంగా ఆమోదించింది’ అని అందులో పేర్కొన్నారు. 

కాగా, లౌకిక పార్టీలతో కలిసి ఎన్నికల్లో పోటీ కోసం సీపీఎం సెంట్రల్‌ కమిటీ అక్టోబర్‌ నెలలోనే అంగీకారం తెలిపింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌, వామపక్షాలు కలిసి స్థానాలను కేటాయించుకుని పోటీ చేయనున్నాయి. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo