మంగళవారం 07 ఏప్రిల్ 2020
National - Mar 16, 2020 , 18:29:26

బెంగాల్‌, జార్ఖండ్‌లోనూ స్కూళ్లకు సెలవులు

బెంగాల్‌, జార్ఖండ్‌లోనూ స్కూళ్లకు సెలవులు

హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ర్టాలు అప్రమత్తమయ్యాయి. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. తాజాగా పశ్చిమ బెంగాల్‌, జార్ఖండ్‌ రాష్ర్టాలు కూడా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాయి. బెంగాల్‌లో ఏప్రిల్‌ 15వ తేది వరకు, జార్ఖండ్‌లో ఏప్రిల్‌ 14వ తేది పాఠశాలలు, కాలేజీలు మూసివేయనున్నారు.

బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేసి కరోనా వైరస్‌పై చర్చించారు. బెంగాల్‌ ప్రభుత్వం కరోనా కట్టడికి ప్రత్యేకంగా రూ. 200 కోట్ల నిధులను కేటాయిస్తున్నట్లు తెలిపింది. ఈ నిధులను మాస్కుల కొనుగోలు, మెడికల్‌ స్టాఫ్‌, ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగించనున్నారు. ఇక విద్యాసంస్థలతో పాటు ఆడిటోరియమ్స్‌, సినిమా హాల్స్‌ను కూడా మూసివేయాలని మమతా బెనర్జీ ఆదేశించారు. 


logo