సోమవారం 25 జనవరి 2021
National - Dec 19, 2020 , 17:38:05

వైర‌స్ పీడ విర‌గ‌డైంది: బెంగాల్ మాజీ మంత్రి

వైర‌స్ పీడ విర‌గ‌డైంది: బెంగాల్ మాజీ మంత్రి

కోల్‌క‌తా: ఒక‌వైపు తృణ‌మూల్ కాంగ్రెస్‌ను ఖాళీ చేసి ప‌శ్చిమ‌బెంగాల్‌లో అధికారం చేప‌ట్ట‌బోతున్నామంటూ బీజేపీ నేత‌లు మురిసిపోతుంటే.. మ‌రోవైపు త‌మ పార్టీలో వైర‌స్ అంతా బీజేపీలోకి వెళ్లిపోవ‌డంతో పీడ విర‌గ‌డైంద‌ని తృణ‌మూల్ కాంగ్రెస్ నేత‌లు సంబుర‌ప‌డుతున్నారు. అయితే, ఇవాళ బీజేపీ తీర్థం పుచ్చుకున్న అనంత‌రం మిడ్నాపూర్ బ‌హిరంగ స‌భ‌లో సువేందు అధికారి చేసిన వ్యాఖ్య‌ల‌పై తృణ‌మూల్ నేత మ‌ద‌న్ మిత్ర మండిప‌డ్డారు. 

నేను ఒక్క విష‌యం చెప్పద‌ల్చుకున్నా. గ‌త ప‌దేండ్లుగా రాష్ట్రం కోసం తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ చేసిందేమీ లేద‌ని సువేందు అధికారి విమ‌ర్శించారు. మ‌రి ప‌దేండ్లుగా పార్టీ ఏమి చేయ‌న‌ప్పుడు ఈ ప‌దేండ్లుగా పార్టీలోనే ఉన్న ఆయ‌న‌ ఎందుకు నోరు మెద‌ప‌లేదు..? అని మ‌ద‌న్ మిత్ర ప్ర‌శ్నించారు. పార్టీ మార‌గానే ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌న్నారు. ఏదేమైనా తృణ‌మూల్ కార్య‌క‌ర్త‌లకు ఇది ఒక శుభ సాయంత్రమ‌ని, ఈ రోజు త‌మ‌కు వైర‌స్ (పార్టీ నుంచి వెళ్లిపోయిన వాళ్లు) పీడ విర‌గ‌డైంద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చ‌ద‌వండి..
ఎన్నిక‌ల నాటికి మిగిలేది ఆమె ఒక్క‌రే: అమిత్ షా

బెంగాల్‌లో ఆర్థిక ప‌రిస్థితి ద‌య‌నీయం: సువేందు

బీజేపీలో చేరిన సువేందు అధికారి
గుండెపోటుతో శివ‌సేన సీనియ‌ర్ నేత మృతి

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.     


logo