అతి సుందరంగా ముస్తాబైన నూతన వధూవరులను తన కెమెరాలో బంధించే పనిలో ఓ ఫోటోగ్రాఫర్ నిమగ్నమయ్యాడు. అలా నూతన జంటను తన కెమెరాలో బంధిస్తూ.. స్విమ్మింగ్ ఫూల్లో పడిపోయాడు. దీంతో పెళ్లి కూతురు షాకైంది. అయ్యో ఫోటోగ్రాఫర్ ఫూల్ పడ్డాడు అనుకుంటూ తన హావభావాలను తెలిపింది పెళ్లి కూతురు. అక్కడున్న వారంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కొందరైతే నవ్వుకున్నారు.
మొత్తానికి తన కెమెరాను నీళ్లలో పడకుండా ఫోటోగ్రాఫర్ జాగ్రత్త తీసుకున్నాడు. తక్షణమే ఆ స్విమ్మింగ్ ఫూల్లో నుంచి ఫోటోగ్రాఫర్ బయటకు వచ్చేందుకు మరొక ఫోటోగ్రాఫర్ సాయం అందించాడు. ఈ వీడియోలను అపెరినా స్టూడియో వారు తమ ఇన్స్టా గ్రాం ఖాతాలో పోస్టు చేశారు. గత నెలలో ఈ ఘటన జరిగినప్పటికీ.. ఇప్పుడు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.