గురువారం 28 మే 2020
National - May 24, 2020 , 11:26:03

పరిమిత సంఖ్యలో బంధువులు.. ఒక్కటైన వధూవరులు

పరిమిత సంఖ్యలో బంధువులు.. ఒక్కటైన వధూవరులు

బెంగళూరు: దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్నా కేంద్రం ఇచ్చిన సడలింపుల మేరకు కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకు చెందిన ఓ జంట నిరాడంబరంగా వివాహం చేసుకున్నది. కరోనా మహమ్మారి విస్తరించడంతో గత మార్చి 24 నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి జనం ఇండ్లకే పరిమితమయ్యారు. స్కూళ్లు, కాలేజీలు, రెస్టారెంట్లు, షాపింగ్‌మాళ్లు ఇలా అన్నీ మూతపడ్డాయి. ప్రజా రవాణా నిలిచిపోయింది. ఆలయాల్లో భక్తుల ప్రవేశాలపైన, పెండ్లిళ్లు ఫంక్లన్లపైన నిషేధం అమల్లోకి వచ్చింది. 

అయితే, నాలుగో విడత లాక్‌డౌన్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇచ్చింది. అందులో భాగంగా 50 మందికి మించకుండా బంధువులను పిలుచుకుని వివాహం జరుపుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో ఇన్నాళ్లు ఆగిపోయిన వివాహాలు ఇప్పుడు మళ్లీ మొదలయ్యాయి. ఈ క్రమంలోనే తాజాగా కర్ణాటకకు చెందిన ఓ జంట వివాహం చేసుకున్నది. కాగా, ప్రభుత్వ సడలింపుల మేరకు 50 మంది బంధువులకు అనుమతి ఉన్నా, కరోనా వేళ రిస్క్‌ చేయడం ఎందుకని 25 మందినే ఆహ్వానించామని పెండ్లి కొడుకు సతీశ్‌ చెప్పాడు. 


logo