మంగళవారం 04 ఆగస్టు 2020
National - Jul 24, 2020 , 15:13:38

కేంద్ర మంత్రి ఫిర్యాదుతో వెబ్‌సైట్ మూసివేత‌..

కేంద్ర మంత్రి ఫిర్యాదుతో వెబ్‌సైట్ మూసివేత‌..

హైద‌రాబాద్‌: కేంద్ర ప‌ర్యావ‌ర‌ణ‌శాఖ మంత్రి ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్ ఇచ్చిన ఫిర్యాదుతో.. ఫ్రైడేస్ ఫ‌ర్ ఫ్యూచ‌ర్‌ అన్న వెబ్‌సైట్‌ను ఢిల్లీ సైబ‌ర్ క్రైమ్ పోలీసులు మూసివేశారు.  వివాదాస్ప‌ద ప‌ర్యావ‌ర‌ణ 2020 నోటిఫికేషన్‌ను వ్య‌తిరేకిస్తూ ఫ్రైడేస్ ఫ‌ర్ ఫ్యూచ‌ర్‌ వెబ్‌సైట్ నుంచి వేల సంఖ్య‌లో మంత్రి ఈమెయిల్ బాక్సు‌కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో మంత్రి ఈ-మెయిల్ స్పామ్‌లోకి వెళ్లిపోయింది. ఈ నేప‌థ్యంలో జ‌వ‌దేక‌ర్ ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు ఢిల్లీ సైబ‌ర్‌ క్రైమ్ పోలీసులు ఆ వెబ్‌సైట్‌ను ష‌ట్‌డౌన్ చేశారు.  ప‌ర్యావ‌ర‌ణ సంబంధిత నిర‌స‌న‌ల‌ను వ్య‌క్తం చేసేందుకు www.fridaysforfuture.in వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. జూలై 12వ తేదీన ఐటీ చ‌ట్టంలోని సెక్ష‌న్ 66 ప్ర‌కారం వెబ్‌సైట్‌ను నోటీసులు జారీ చేసిన‌ట్లు సైబ‌ర్ క్రైమ్ డీసీపీ అయ్‌నేశ్ రాయ్ తెలిపారు.  యూఏపీఏ చ‌ట్టం కింద ఫ్రైడేస్ ఫ‌ర్ ఫ్యూచ‌ర్‌ వెబ్‌సైట్‌ను బ్లాక్ చేసిన‌ట్లు పోలీసులు చెప్పారు. logo