శనివారం 28 నవంబర్ 2020
National - Nov 19, 2020 , 15:39:39

రక్షణరంగ పరిశ్రమల్లో భాగస్వామ్యంపై ఇండొనేసియాతో వెబినార్

రక్షణరంగ పరిశ్రమల్లో భాగస్వామ్యంపై ఇండొనేసియాతో వెబినార్

ఢిల్లీ :భారత రక్షణరంగ పరిశ్రమ- సహకార భాగస్వామ్యం కోసం "అంతర్జాతీయ అనుబంధం"అనే అంశం పై భారత్-ఇండొనేసియా మధ్య వెబినార్, ఎక్స్ పో జరిగింది. రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన రక్షణ ఉత్పత్తుల విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. మిత్ర దేశాలతో వరుసగా జరుగుతున్న కార్యక్రమాలలో భాగంగా దీన్ని చేప ట్టారు. దీని వల్ల రక్షణ రంగ ఉత్పత్తుల ఎగుమతులకు ప్రోత్సాహం లభిస్తుందని భావిస్తున్నారు. వచ్చే ఐదేండ్లలో 500 కోట్ల డాలర్ల మేరకు రక్షణ రంగ ఉత్పత్తులు ఎగుమతి చేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకున్నది. ఇరు దేశాలకు చెందిన  అధికారులు ఈ వెబినార్ లో పాల్గొన్నారు.

సాయుధ బలగాలను ఆధునీకరించే క్రమంలో స్వదేశీ పరిజ్ఞానాన్ని వినియోగించుకోవటం మీద, మరిన్ని అవకాశాలను వాడుకోవటం మీద వారు ఈ వెబినార్ లో చర్చించారు.భారతదేశానికి చెందిన ఎల్ అండ్ టి డిఫెన్స్, అశోక్ లైలాండ్, భారత్ ఫోర్జ్, టాటా ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్, ఎంకెయు, గోవా షిప్ యార్డ్ లిమిటెడ్, భారత్ ఎలక్ట్రానిక్స్ తదితర సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శించి వాటి గురించి వివరించాయి. ఇండొనేసియా వైపు నుంచి పిటి పిండాడ్, పిటి పాల్, పిటి ఎల్ ఇ ఎన్, పిటి దహనా , పిటి దిర్గంతర తమ ప్రజెంటేషన్ ఇచ్చాయి. 150 మందికి పైగా ఈ వెబినార్ లో పాల్గొన్నారు.  ఎక్స్ పో లో 100 కి పైగా వర్చువల్ ఎగ్జిబిషన్ స్టాల్స్ ఏర్పాటయ్యాయి. 

వారెన్ బఫెట్ సంచలన నిర్ణయాలు...

ముగ్గురు భార్యల సహకారంతో నాలుగో పెండ్లికి సిద్ధమైన భర్త....!

 లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.