సోమవారం 25 జనవరి 2021
National - Aug 21, 2020 , 22:04:53

ఫిక్కీ హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యం లో ఆరోగ్య సంరక్షణపై వెబినార్

  ఫిక్కీ హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యం లో ఆరోగ్య సంరక్షణపై వెబినార్

హైదరాబాద్ : కోవిడ్ అనంతరం ఆరోగ్య సంరక్షణ భవితవ్యం అనే అంశం పై వెబినార్ జరిగింది. ఫిక్కీ హైదరాబాద్ చాప్టర్, ఎస్ ఎల్ జీ హాస్పిటల్స్ సంయుక్తాధ్వర్యంలో ఈ వెబినార్ ను నిర్వహిం చారు. ఇందులో వక్తలు పలు కీలక అంశాలను ప్రస్తావించారు. పటిష్ఠంగా, ఉన్నతస్థాయిలో, వేగంగా ఆరోగ్య సంరక్షణ మౌలిక వసతులను కల్పించాల్సిన అవసరం ఉందని ఎస్ఎల్జీ హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డివిఎస్ సోమరాజు అన్నారు.

ఏఎస్ సీఐసెంటర్ ఫర్ హెల్త్ కేర్ మేనేజ్ మెంట్ డైరెక్టర్ ప్రొఫెసర్ సుబోధ్ కందముత్తన్ మాట్లాడుతూ, సామర్థ్యం ఏమేరకు ఉండాలో నిర్ణయించుకునేందుకు వ్యాధి ఏస్థాయిలో ముందుకెళ్తుందో అంచనా వేయడం తప్పనిసరి అని, సెప్టెంబర్ నాటికి కోవిడ్ కేసుల సంఖ్య మూడింతలు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా  పీహెచ్ సీ,  యూపీహెచ్ సీ మరియు ప్రైవేటు ఆరోగ్య సంరక్షణ యంత్రాంగాన్ని మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ వెబినార్ లో ప్యానలిస్టులుగా ఎస్ఎల్జీ హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డివిఎస్ సోమరాజు, ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ వి.జగన్మోహన్, నెఫ్రాలజిస్ట్ డాక్టర్ పి.విజయ్ వర్మ, ఇంటర్నల్ మెడిసిన్ డాక్టర్ ఆరతి బళ్లారి, సిహెచ్ డి గ్రూప్ సీఈఓ డాక్టర్ ఎడ్మండ్ ఫెర్నాండెజ్, . ఏఎస్ సీఐ సెంటర్ ఫర్ హెల్త్ కేర్ మేనేజ్ మెంట్ డైరెక్టర్ ప్రొఫెసర్ సుబోధ్ కందముత్తన్ పాల్గొన్నారు.  


logo