శనివారం 04 జూలై 2020
National - Jun 19, 2020 , 11:31:22

జూన్‌ 22 నుంచి 24 మధ్య వాతావరణం మారుతుంది : ఆనంద్‌శర్మ

జూన్‌ 22 నుంచి 24 మధ్య వాతావరణం మారుతుంది : ఆనంద్‌శర్మ

న్యూ ఢిల్లీ : జూన్‌ 22 నుంచి 24 మధ్య వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండబోతున్నాయని భారత వాతావరణ శాఖ డిప్యూటీ జనరల్‌ డైరెక్టర్‌ ఆనంద్‌శర్మ తెలిపారు. ఈ సమయంలో ఉత్తరప్రదేశ్‌, హిమాలయాలకు రుతుపవనాలు వస్తాయని పేర్కొన్నారు. జూన్ 25 వరకు ఢిల్లీ ఎన్‌సీఆర్‌కు రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు. 

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు అక్కడక్కడా జల్లులు మాత్రమే కురిశాయి. దీంతో కొన్నిచోట్ల రైతులు ఇప్పటికే విత్తనాలు విత్తి, వరినాట్లు వేసేందుకు మడులు సిద్ధం చేసుకున్నారు. బోర్లు, బావులు ఉన్న రైతులు కొన్నిచోట్ల ఇప్పటికే వరినాట్లు కూడా వేశారు.  తాజాగా వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీకి ఈనెల 25 లోపు రుతుపవనాలు చేరితే మరో రెండు రోజుల్లో అంటే 27 నుంచి 28 మధ్యలో తెలంగాణలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. 


logo