గాంధీనగర్, మార్చి 15: టీ షర్ట్ ధరించి వచ్చాడన్న కారణంతో గుజరాత్ స్పీకర్ రాజేంద్ర త్రివేది కాంగ్రెస్ ఎమ్మెల్యే విమల్ చూడాసమాను అసెంబ్లీ నుంచి బహిష్కరించారు. కుర్తా లేదా షర్టు వేసుకొని రావాలని అంతవరకు సభకు రావొద్దని ఆదేశించారు. సభ గౌరవాన్ని కాపాడాలని సూచించారు. దీనిపై విమల్ అభ్యంతరం చెప్పారు. ఫలానా రకం దుస్తులు వేసుకొనే అసెంబ్లీకి రావాలని ఎక్కడా లేదని వాదించారు. వారం క్రితం విమల్ టీ షర్ట్ వేసుకొని సభకు వచ్చారు. మరోసారి టీషర్ట్ వేసుకురావద్దని విమల్‌ను ఆరోజే స్పీకర్ కోరారు.