శుక్రవారం 27 నవంబర్ 2020
National - Nov 22, 2020 , 18:13:09

బీజేపీ ఆ పని చేస్తే స్వాగతిస్తాం : నవాబ్‌ మాలిక్‌

బీజేపీ ఆ పని చేస్తే స్వాగతిస్తాం : నవాబ్‌ మాలిక్‌

ముంబై : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ను దేశంలో విలీనం చేసి ఐక్య భారత్‌గా మారిస్తే తాము స్వాగతిస్తామని ఎన్‌సీపీ ( నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ) సీనియర్‌ నాయకుడు,  మహారాష్ట్ర మంత్రి నవాజ్‌ మాలిక్‌ అన్నారు. కరాచీని భారత్‌లో కలుపే సమయం ఆనన్నమైందని బీజేపీ సీనియర్‌ నాయకుడు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నావీస్‌ చేసిన వ్యాఖ్యలపై ఆదివారం మాలిక్‌ స్పందించారు. బెర్లిన్‌ గోడ ధ్వంసం చేసినప్పుడు భారత్‌, బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌ కలిస్తే తప్పేముందని ఆయన వ్యాఖ్యానించారు. మూడు దేశాలను ఏకం చేసి ఐక్య భారతావని నిర్మిస్తే తాము తప్పకుండా స్వాగతిస్తామని పేర్కొన్నారు.

రానున్న ముంబై మహానగర పాలిక ఎన్నికల్లో ఎన్‌సీపీ, శివసేన, కాంగ్రెస్‌ మహావికాస్‌ ఆగాడి కూటమిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. ‘ఎన్నికలకు ఇంకా 15 నెలల సమయం ఉందని, ఎవరి పార్టీ కోసం వారు పని చేసుకోవచ్చన్నారు. మహారాష్ట్రలో మరోసారి లాక్‌డౌన్‌ ఉంటుందా? అన్న ప్రశ్నకు అలాంటి ఆలోచనేది ప్రభుత్వ మదిలో లేదని స్పష్టం చేశారు. ‘కరోనా రెండోదశ వ్యాప్తిపై సమీక్షించేందుకు ఆరోగ్య కార్యదర్శలు ప్రతి జిల్లాకు సలహా దారులను పంపారు. కరోనాను నియంత్రించడంలో విజయవంతమయ్యాం. ఇతర రాష్ట్రాల్లో వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున కొన్ని నిబంధలు విధిస్తున్నాయి. మహారాష్ట్రలో ఆ పరిస్థితి లేదు’ అని మాలిక్‌ తెలిపారు.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.