శుక్రవారం 14 ఆగస్టు 2020
National - Jul 21, 2020 , 16:26:11

బెంగాల్ నుంచి బీజేపీని పార‌దోలుతాం: మ‌మ‌తాబెన‌ర్జి

బెంగాల్ నుంచి బీజేపీని పార‌దోలుతాం: మ‌మ‌తాబెన‌ర్జి

కోల్‌క‌తా: ప‌శ్చిమ‌బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తాబెన‌ర్జి మ‌రోసారి బీజేపీపై నిప్పులు చెరిగారు. 2021లో జ‌రిగే బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీని రాష్ట్రం నుంచి పార‌దోలుతామ‌ని ఆమె వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో మ‌ళ్లీ తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీయే ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తుంద‌ని మ‌మ‌త‌ ధీమా వ్య‌క్తం చేశారు. వ‌చ్చే ఏడాది ప‌శ్చిమ‌బెంగాల్లో జ‌రుగ‌బోయే అసెంబ్లీ ఎన్నిక‌లు రాష్ట్రానికి, దేశానికి కొత్త మార్గాన్ని చూపుతాయ‌ని మ‌మ‌తాబెన‌ర్జి చెప్పారు.   

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo