మంగళవారం 04 ఆగస్టు 2020
National - Jul 11, 2020 , 22:11:29

అవినీతి,నేరాలు రూపుమపడానికి అన్ని చర్యలు తీసుకొంటాం : సీఎం యోగి

అవినీతి,నేరాలు రూపుమపడానికి అన్ని చర్యలు తీసుకొంటాం  : సీఎం యోగి

న్యూఢిల్లీ :  రాష్ట్రంలో అవినీతి, నేరాలను రూపుమపడానికి  అన్ని చర్యలు తీసుకొంటామని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఆదిత్యనాధ్‌ స్పష్టం చేశారు. శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నేరాలు, అవినీతిని అంతం చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని, అవినితి, నేరరహిత రాష్ట్రంగా మార్చడమే మా విధానం అని పేర్కొన్నారు. 

లా అండ్‌ ఆర్డర్‌ను రాష్ట్రంలో కొనసాగించడం, 20కోట్ల మంది ప్రజలను రక్షించడం మా బాధ్యత అని సీఎం యోగి తెలిపారు.  కరోనా నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లో ఉన్న అనేకమంది కార్మికులు  సొంత రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌ వచ్చారు.  వారు 40లక్షల వరకు ఉన్నారు. దేశ  ప్రధాని నరేంద్రమోఢీ నాయకత్వంలో ముందుకు వెళ్తూ.. కార్మికులు, కూలీలకు కావలసిన ఉపాధి, వసతులను కల్పిస్తున్నామన్నారు. ఇతరరాష్ట్రాలకు వలస వెళ్లిన ప్రజలు సొంత రాష్ట్రానికి వచ్చిన దృష్ట్యా వారికి ఇక్కడ పని కల్పిస్తామని తెలిపారు.  ఆత్మనిర్భర్‌ ద్వారా ప్రజలు ఆర్థిక, వ్యాపారాభివృద్ధి సాధించుటకు తీసుకోవలసిన చర్యలపై దృష్టి కేంద్రీకరించాం. ఎన్‌ఆర్‌ఐలు భారత ప్రజల అభ్యున్నతికి  సహాయం చేయాలని సీఎం యోగి విన్నవించారు.  కరోనా మహమ్మారిని విజయవంతంగా ఎదుర్కొని పీపీఈ కిట్లు, ఎన్‌-95 మాస్క్‌లను ఎగుమతి చేసే స్థాయికి అభివృద్ధి చెందామని వెల్లడించారు. ఉత్తర ప్రదేశ్‌లో రోజు 45000 కొవిద్‌-19 పరీక్షలు చేస్తున్నామని సీఎం ఆదిత్యనాధ్‌ తెలపారు. 


logo