శనివారం 27 ఫిబ్రవరి 2021
National - Jan 18, 2021 , 17:39:31

బెంగాల్‌లో మ‌మ‌త‌కు మ‌ద్ద‌తిస్తాం: అఖిలేశ్‌

బెంగాల్‌లో మ‌మ‌త‌కు మ‌ద్ద‌తిస్తాం: అఖిలేశ్‌

ల‌క్నో: ప‌శ్చిమ‌బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తాము మ‌మ‌తాబెన‌ర్జికి మ‌ద్ద‌తిస్తామ‌ని స‌మాజ్‌వాది పార్టీ అధ్య‌క్షుడు, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి అఖిలేష్ యాద‌వ్ ప్ర‌క‌టించారు. విద్వేష రాజ‌కీయాల‌తో బెంగాల్‌లో అధికారంలోకి వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్న బీజేపీని ఓడించ‌డం కోసం తాము అధికార‌ తృణ‌మూల్ కాంగ్రెస్‌కు మ‌ద్ద‌తివ్వాల‌ని నిర్ణ‌యించామ‌ని చెప్పారు.‌ ఇవాళ ఉత్త‌ప్ర‌దేశ్ రాజ‌ధాని ల‌క్నోలో జ‌రిగిన పార్టీ కార్య‌వ‌ర్గ స‌మావేశంలో ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు అఖిలేష్ వెల్ల‌డించారు.

ఎక్క‌డ ఎన్నిక‌లు జ‌రిగినా అక్క‌డ విద్వేషాల‌ను రెచ్చ‌గొట్టి అధికారంలోకి రావ‌డం బీజేపీకి అల‌వాటుగా మారింద‌ని అఖిలేష్ యాద‌వ్ ఆరోపించారు. 2017లో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో సైతం విద్వేష రాజ‌కీయాల‌తోనే బీజేపీ గెలిచింద‌ని ఆయ‌న విమ‌ర్శించారు.                   

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo