National
- Jan 07, 2021 , 01:42:57
‘మత మార్పిడి నిషేధ’ చట్టాలపై సమీక్షిస్తాం

న్యూఢిల్లీ: ‘లవ్ జిహాద్'ను అడ్డుకునే పేరుతో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు ఇటీవల వేర్వేరుగా తీసుకొచ్చిన బలవంతపు మత మార్పిడి నిరోధక చట్టాల చెల్లుబాటుపై సమీక్ష జరుపడానికి సుప్రీంకోర్టు సమ్మతించింది. మత మార్పిడి నిరోధక చట్టాలను సవాల్ చేస్తూ న్యాయవాది విశాల్ ఠాక్రే, ‘సిటిజెన్ ఫర్ జస్టిస్ ఆండ్ పీస్' అనే ఎన్జీవో దాఖలు చేసిన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం బుధవారం విచారణ చేపట్టింది. ఈ మేరకు ఈ చట్టాలపై నాలుగు వారాల్లోగా సమాధానమివ్వాలని యూపీ, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది.
తాజావార్తలు
MOST READ
TRENDING