శనివారం 31 అక్టోబర్ 2020
National - Sep 25, 2020 , 20:01:58

ఇంటర్‌ పాసైతే రూ.25 వేలు.. డిగ్రీ పాసైతే రూ.50 వేలు..

ఇంటర్‌ పాసైతే రూ.25 వేలు.. డిగ్రీ పాసైతే రూ.50 వేలు..

పాట్నా: ఇంటర్‌ పాసైన బాలికలకు రూ.25 వేలు, డిగ్రీ పాసైన బాలికలకు రూ.50 వేలు ఇస్తామని బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ తెలిపారు. నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత ప్రోత్సాహానికి ఒక కొత్త శాఖను ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. ఐటీఐ, పాలిటెక్నిక్‌ సంస్థలు ఆ శాఖ కిందకు వస్తాయని అన్నారు. కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేయాలని భావించేవారికి ఆర్థిక సహాయం చేస్తామని నితీశ్‌ కుమార్‌ చెప్పారు. బీహార్‌ ఎన్నికల నగరా మోగడంతో తాయిళాలు ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఈసీ ప్రకటించడాన్ని తాము స్వాగతిస్తున్నట్లు ఆయన తెలిపారు. 

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలను మూడు దశల్లో నిర్వహిస్తామని ఈసీ తెలిపింది. అక్టోబరు 28న తొలి దశ, నవంబర్‌ 3న రెండో దశ, 7న మూడో దశ ఎన్నికలు జరుగుతాయని, 10వ తేదీన ఓట్లను లెక్కించి ఫలితాలు ప్రకటిస్తామని సీఈసీ సునిల్ అరోరా తెలిపారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలం­గాణ ఆండ్రా­యిడ్ యాప్ డౌన్‌­లోడ్ చేసు­కోండి