బుధవారం 08 ఏప్రిల్ 2020
National - Mar 10, 2020 , 22:41:42

మా మెజారిటీ నిరూపించుకుంటాం: సీఎం కమల్ నాథ్

మా మెజారిటీ నిరూపించుకుంటాం: సీఎం కమల్ నాథ్

భోపాల్ : మధ్యప్రదేశ్‌ లో మా ప్రభుత్వానికి వచ్చిన ఢోకా ఏమి లేదని ఆ రాష్ట్ర సీఎం కమల్‌ నాథ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి 22 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కమల్ నాథ్ మీడియాతో మాట్లాడుతూ..ప్రస్తుత పరిస్థితులపై బాధపడాల్సిన అవసరం లేదు. మేం తప్పకుండా  మెజారిటీ నిరూపించుకుంటాం. మా ప్రభుత్వం పూర్తికాలం ప్రజలకు సేవలందిస్తుందని ధీమావ్యక్తం చేశారు. 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం, కీలక నేతగా ఉన్న జ్యోతిరాధిత్య సింధియా కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరనున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్ లో కమల్‌ నాథ్ ప్రభుత్వం కొనసాగుతుందా..? లేదా అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.  


logo