శనివారం 05 డిసెంబర్ 2020
National - Nov 05, 2020 , 15:16:29

తృణముల్‌ ప్రభుత్వాన్ని పడగొడతాం : అమిత్‌ షా

తృణముల్‌ ప్రభుత్వాన్ని పడగొడతాం : అమిత్‌ షా

కోల్‌కతా : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మూడింట రెండొంతుల మెజారిటీతో తృణముల్‌ కాంగ్రెస్‌ నేతృత్వంలోని పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వాన్ని బీజేపీ పడగొడుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అన్నారు. రెండు రోజుల పశ్చిమ బెంగాల్‌ పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి గురువారం బంకురాలో పర్యటించారు. ఈ సందర్భంగా గిరిజన స్వాతంత్ర్య సమరయోధుడు బిర్సా ముండా విగ్రహం వద్ద నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీజేపీ కార్యకర్తలు ప్రతి రోజూ బెంగాల్‌ అధికార పార్టీచే దారుణాలు ఎదుర్కొంటున్నారన్నారు. వచ్చే ఏడాది ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు తగిన సమాధానం ఇస్తారన్నారు. బెంగాల్‌ పేదరికం, నిరుద్యోగంలో చిక్కుకుందని, పేదల కోసం ఉద్దేశించిన 80కిపైగా కేంద్ర ప్రభుత్వ పథకాలను సీఎం మమతా బెనర్జీ నిషేధించారని ఆరోపించారు. బీజేపీకి రాష్ట్రాన్ని నడిపించే అవకాశం ఇస్తే, బెంగాల్‌ను బంగారు బంగ్లాగా మారుస్తామన్నారు. ఈ సందర్భంగా అమిత్‌ షా ఓ గిరిజన కుటుంబం ఇంట్లో భోజనం చేశాడు. గతేడాది సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇచ్చిన శరణార్థుల ఇంట్లో శుక్రవారం హోం మంత్రి భోజనం చేయనున్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.