శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
National - Jan 17, 2021 , 12:50:45

బెంగాల్ ర‌క్ష‌ణ కోసం కాంగ్రెస్‌తో క‌లిసి ప‌నిచేస్తాం: బిమ‌న్‌బోస్

బెంగాల్ ర‌క్ష‌ణ కోసం కాంగ్రెస్‌తో క‌లిసి ప‌నిచేస్తాం: బిమ‌న్‌బోస్

న్యూఢిల్లీ: ప‌శ్చిమ‌బెంగాల్లో అసెంబ్లీ ఎన్నిక‌ల గ‌డువు ద‌గ్గ‌ర ప‌డ‌టంతో అన్ని పార్టీలు వ్యూహాల‌కు ప‌దును పెడుతున్నాయి. పొత్తుల‌పై క‌స‌ర‌త్తులు కొన‌సాగిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ప‌శ్చిమ‌బెంగాల్ వామ‌ప‌క్ష కూట‌మి ఛైర్మ‌న్ బిమ‌న్‌బోస్ కాంగ్రెస్‌తో త‌మ పొత్తు విష‌యంపై స్పందించారు. బెంగాల్ రాష్ట్రాన్ని మ‌త‌తత్వ శ‌క్తుల‌ భారీ నుంచి కాపాడాల్సిన‌ అవ‌స‌రం ఉన్న‌ద‌ని, అందుకోసం వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తాము కాంగ్రెస్‌తో క‌లిసి బ‌రిలో దిగుతామ‌ని ఆయ‌న చెప్పారు.

కాంగ్రెస్, వామ‌ప‌క్ష కూట‌మి మ‌ధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు ‌లేవ‌ని, బీజేపీ, తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీల‌కు వ్య‌తిరేకంగా తాము క‌లిసి ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డం ఖాయ‌మ‌ని బిమ‌న్ బోస్ చెప్పారు.  అయితే, ఎవ‌రు ఎన్ని సీట్ల‌లో పోటీ చేయాల‌నే విష‌యంలో చ‌ర్చ‌లు జ‌రుగాల్సి ఉన్న‌ద‌ని ఆయ‌న తెలిపారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo