బుధవారం 20 జనవరి 2021
National - Jan 02, 2021 , 18:47:19

సంక్రాంతి నాటికి అందుబాటులోకి వ్యాక్సిన్‌: ‌యూపీ సీఎం

సంక్రాంతి నాటికి అందుబాటులోకి వ్యాక్సిన్‌: ‌యూపీ సీఎం

ల‌క్నో: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఈ నెల 14న జ‌రుగబోయే మకర సంక్రాంతి నాటికి క‌రోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌స్తుంద‌ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయ‌న‌.. ప్రధాని నరేంద్రమోదీ సారథ్యంలో 2020 మార్చిలో కొవిడ్-19 నిర్మూల‌న‌కు పాటించాల్సిన‌ జాగ్రత్తలపై ప్రచారం మొదలుపెట్టామన్నారు. ఈ ఏడాది ఆరంభంలోనే రాష్ట్రంలో వ్యాక్సిన్ డ్రై రన్ ప్రారంభించామని, మకర సంక్రాంతి నాటికి వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo