శనివారం 31 అక్టోబర్ 2020
National - Sep 06, 2020 , 16:53:38

కేశ‌వానంద భార‌తి భావిత‌రాల‌కు స్ఫూర్తి : మోదీ

కేశ‌వానంద భార‌తి భావిత‌రాల‌కు స్ఫూర్తి : మోదీ

న్యూఢిల్లీ : ప‌్ర‌ముఖ‌ ఆధ్యాత్మిక గురువు కేశ‌వానంద భార‌తి(79) మృతిప‌ట్ల ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ తీవ్ర దిగ్ర్భాంతి వ్య‌క్తం చేశారు. అణ‌గారిన‌ వ‌ర్గాల అభివృద్ధికి చేసిన కేశవానంద‌ కృషిని, స‌మాజ సేవ ఎల్ల‌ప్పుడూ గుర్తుంచుకుంటామ‌ని మోదీ ట్వీట్ చేశారు. భార‌త‌దేశ గొప్ప సంస్కృతి, సంప్ర‌దాయాలు, రాజ్యాంగాన్ని గౌర‌వించే వారు అని పేర్కొన్నారు. కేశ‌వానంద భార‌తి భావితరాల‌కు స్ఫూర్తిగా నిలుస్తార‌ని మోదీ అన్నారు.  

కేర‌ళ‌లోని ఎడ‌నీర్ మ‌ఠ్‌లో కేశ‌వానంద భార‌తి శివైక్యం పొందిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. రాజ్యాంగ మౌలిక స్వ‌రూపం ఏర్పాటుకు దారి తీసిన కేసులో భార‌త ప్ర‌ధాన పిటిష‌న‌ర్‌గా ఉన్నారు. కేర‌ళ భూసంస్క‌ర‌ణ చ‌ట్టంపై 1973లో  కేశ‌వానంద భార‌తి సుప్రీంకోర్టులో పిటిష‌న్ వేశారు. ఈ కేసు కేశ‌వానంద భార‌తి వ‌ర్సెస్ స్టేట్ ఆఫ్ కేర‌ళ‌గా ప్రాచుర్యం పొందింది. ఈ కేసును 13 మంది న్యాయ‌మూర్తుల‌తో కోర్టు విచార‌ణ జ‌రిపింది. రాజ్యాంగ మౌలిక స్వ‌రూపానికి సుప్రీంకోర్టు సంర‌క్ష‌ణ‌దారని తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు చ‌రిత్ర‌లోనే ఈ కేసు సుదీర్ఘంగా 68 రోజుల పాటు విచార‌ణ జ‌రిగింది. కేశవానంద భారతి ఆశ్రమానికి చెందిన మఠాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడాన్ని సవాలు చేస్తూ ఈ కేసు దాఖలైంది.  చరిత్ర గతినే మార్చివేసిన కేసుగా దీన్ని న్యాయ కోవిదులు అభివర్ణిస్తుంటారు.  

1973లో నాటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ ఎం సిక్రీ నేతృత్వంలో జేఎం షెలట్, కేఎస్ హెగ్డే, ఏఎన్ గ్రోవర్, బీ జగన్మోహన్ రెడ్డి, డీజీ పాలేకర్, హెచ్ ఆర్ ఖన్నా, ఏకే ముఖర్జీ, యశ్వంత్ విష్ణు చంద్రచూడ్, ఏఎన్ రాయ్, కేకే మాథ్యూ, ఎంహెచ్ బేగ్, ఎస్ ఎన్ ద్వివేదీ ఈ కేసును విచారించారు. 68 రోజుల సుదీర్ఘ విచారణ అనంతరం ఈ కేసు కేశవానంద భారతికి అనుకూలంగా వెలువడింది. 13 మంది న్యాయమూర్తుల్లో నలుగురు ఈ తీర్పును వ్యతిరేకించారు. తీర్పు ప్రతులపై సంతకాలు చేయలేదు.