గురువారం 02 ఏప్రిల్ 2020
National - Mar 19, 2020 , 18:50:05

సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం: శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌

సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం: శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌

భోపాల్‌:  రేపు మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలో విశ్వాసపరీక్ష నిర్వహించాలన్న సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని బీజేపీ నేత శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ పేర్కొన్నారు. విశ్వాసపరీక్షపై కోర్టు తీర్పు నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ..ప్రస్తుత ప్రభుత్వం మెజారిటీని కోల్పోయింది. అందువల్ల ఇప్పుడున్నది ప్రభుత్వం కాదు. మధ్యవర్తుల ప్రభుత్వమని, మధ్యప్రదేశ్‌ ప్రజలను మోసం చేసిన ప్రభుత్వమని మండిపడ్డారు. రేపు జరుగనున్న విశ్వాసపరీక్షలో ప్రభుత్వం పడిపోవడం ఖాయమని శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ధీమావ్యక్తం చేశారు. రేపు సాయంత్రం 5 గంటల్లోగా విశ్వాసపరీక్షను పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే. 


logo