శనివారం 08 ఆగస్టు 2020
National - Jul 24, 2020 , 14:12:56

సోమ‌వారం నుంచి అసెంబ్లీ స‌మావేశాలు: రాజ‌స్థాన్ సీఎం

సోమ‌వారం నుంచి అసెంబ్లీ స‌మావేశాలు: రాజ‌స్థాన్ సీఎం

జైపూర్‌: స‌చిన్ పైల‌ట్ తిరుగుబాటుతో రాజ‌కీయ సంక్షోభం అంచున నిలిచిన రాజ‌స్థాన్ ప్ర‌భుత్వం అసెంబ్లీ వ‌ర్షాకాల స‌మావేశాలు నిర్వ‌హించేందుకు సిద్ధ‌మైంది. వ‌చ్చే సోమ‌వారం నుంచి అసెంబ్లీ స‌మావేశాలు నిర్వ‌హించ‌నున్న‌ట్లు సీఎం అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. దీనికి సంబంధించి తాను ఇప్ప‌టికే గ‌వ‌ర్న‌ర్‌ క‌ల్రాజ్ మిశ్రాతో మాట్లాడాన‌ని, అసెంబ్లీ స‌మావేశాల నిర్వ‌హ‌ణ‌పై త‌క్ష‌ణ‌మే నిర్ణ‌యం తీసుకోవాల‌ని కోరాన‌ని సీఎం గెహ్లాట్ చెప్పారు.

రాజ‌స్థాన్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి దూకుడుకు క‌ళ్లెంవేసే చ‌ర్య‌లు, రాజ‌కీయ ప‌రిస్థితి స‌హా ప‌లు అంశాల‌పై అసెంబ్లీలో చ‌ర్చించాల్సిన అవ‌స‌రం ఉన్న‌ద‌ని రాజ‌స్థాన్ సీఎం గెహ్లాట్ తెలిపారు. తాము అభ్య‌ర్థించినా గ‌వ‌ర్న‌ర్ అసెంబ్లీ స‌మావేశాల నిర్వ‌హ‌ణ‌పై ఇంకా ఏ నిర్ణ‌యం తీసుకోక‌పోవ‌డాన్ని చూస్తుంటే.. ఆయ‌న‌పై ఏవో ఒత్తిళ్లు ప‌నిచేస్తున్నాయ‌నే అనుమానం క‌లుగుతున్న‌ద‌ని గెహ్లాట్ పేర్కొన్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo