మంగళవారం 31 మార్చి 2020
National - Mar 05, 2020 , 13:35:59

వైరాల‌జీ ఇన్స్‌టిట్యూట్లు మ‌రిన్ని కావాలి..

వైరాల‌జీ ఇన్స్‌టిట్యూట్లు మ‌రిన్ని కావాలి..

హైద‌రాబాద్‌:  లోక్‌స‌భ‌లో ఇవాళ క‌రోనా వైర‌స్‌పై చ‌ర్చ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ప‌లువురు ఎంపీలు మాట్లాడారు. కేవ‌లం పూణెలో మాత్ర‌మే వైరాల‌జీ సెంట‌ర్ ఉన్న‌ద‌ని, ఇది స‌రిపోదు అని, ఇలాంటి ఇన్స్‌టిట్యూట్లు వివిధ జోన్ల‌లో ఏర్పాటు చేయాల‌ని డీఎంకే ఎంపీ క‌నిమొళి ప్ర‌భుత్వాన్ని కోరారు. క‌రోనా ల‌క్ష‌ణాల గురించి కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ వివ‌రించారు. క‌రోనా పేషెంట్ల‌ను ఐసోలేష‌న్ వార్డుల్లో చికిత్స అందించాల‌న్నారు.  వైర‌స్ నియంత్ర‌ణ‌కు నిరంతరం శ్ర‌మించాల‌న్నారు.  

కోవిడ్‌19కు చెందిన న‌కిలీ వార్త‌ల‌ను అడ్డుకోవాల‌ని కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజ‌న్ చౌద‌రీ తెలిపారు. శ్వాస‌కోస ప‌రిశుభ్ర‌త గురించి ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించాల‌న్నారు.  స‌బ్బులు, నీళ్లు, శానిటైజ‌ర్లు నిత్యం అందుబాటులో ఉండే విధంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. ప్ర‌తి పంచాయ‌తీలో థ‌ర్మ‌ల్ స్క్రీనింగ్ ఏర్పాట్లు చేయాల‌న్నారు.  ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌ల‌కు గురికాకుండా ఉండేందుకు టీవీల్లో ప్ర‌క‌ట‌న‌లు ఇవ్వాల‌ని ఎంపీ సౌగ‌త్ రాయ్ కోరారు.  విస్తృత స్థాయిలో అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించాల‌ని ఎస్పీ ఎంపీ అఖిలేశ్ యాద‌వ్ తెలిపారు.  క‌రోనా వ‌ల్ల దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు ఎటువంటి ప్ర‌మాదం ఉందో చెప్పాల‌ని టీడీపీ ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ అన్నారు.  


logo
>>>>>>