శనివారం 06 జూన్ 2020
National - May 13, 2020 , 09:27:02

లాక్ డౌన్ తో మ‌ట్టి పాత్ర‌లు అమ్మలేక‌పోతున్నం..

లాక్ డౌన్ తో మ‌ట్టి పాత్ర‌లు అమ్మలేక‌పోతున్నం..

వార‌ణాసి: లాక్ డౌన్ సుదీర్ఘంగా కొన‌సాగుతుండ‌టంతో కుల‌వృత్తుల‌ను న‌మ్ముకున్న వారికి క‌ష్టాలు త‌ప్ప‌డం లేదు. వార‌ణాసిలో కుండ‌లు, దీపాంత‌లు, ఇత‌ర మ‌ట్టి పాత్ర‌లు చేసే వారికి లాక్ డౌన్ తో ఆదాయం క‌రువైంది. రెక్కాడితే కానీ డొక్కాడ‌నీ ఆ కుటుంబాలు అర్థాక‌లితో అల‌మ‌టిస్తున్నాయి.

వార‌ణాసిలో కుమ్మ‌రి గా పనిచేస్తున్న‌ రాంచంద్ర ప్ర‌జాప‌తి మాట్లాడుతూ..లాక్ డౌన్ తో మార్కెట్లు ప్రారంభం కాక‌పోవ‌డంతో మ‌ట్టి పాత్ర‌లు అమ్మే ప‌రిస్తితి లేదు. మాకు ఆదాయం లేకుండా పోయింది. పూట గ‌డ‌వ‌టం క‌ష్టంగా మారింది. అర్థాక‌లితో కాలం వెళ్ల‌దీసే ప‌రిస్థితి ఏర్ప‌డింది. ప్ర‌భుత్వం మాకు ఇప్ప‌టివ‌ర‌కు ఎలాంటి సాయం చేస్త‌లేదుని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. 
ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo