గురువారం 28 మే 2020
National - May 13, 2020 , 06:34:56

ప్ర‌ధాని మోదీకి ధ‌న్య‌వాదాలు: గోవా సీఎం

ప్ర‌ధాని మోదీకి ధ‌న్య‌వాదాలు: గోవా సీఎం

పానాజీ: గ‌త కొన్నాళ్లుగా క‌రోనా మ‌హమ్మారితో జ‌రిగిన ఆర్థిక‌నష్టం నుంచి ఉప‌శ‌మ‌న క‌ల్పించేందుకు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ ప్ర‌క‌టించిన ఆర్థిక ప్యాకేజీ ప్ర‌శంస‌నీయ‌మైంద‌ని గోవా సీఎం ప్ర‌మోద్ సావంత్ అన్నారు.

దేశంలోని రాష్ట్రాలు ఆర్థికంగా నిలుదొక్కుకునేందుకు రూ.20 ల‌క్ష‌ల కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్ర‌క‌టించడంతో..దేశ‌వ్యాప్తంగా ఆర్థిక‌మైన కార్య‌కలాపాలు పెరిగే అవ‌కాశ‌ముంటుంద‌ని సీఎం ప్ర‌మోద్ సావంత్ ఆశాభావం వ్య‌క్తం చేశారు. ప్ర‌జ‌ల కోసం ఆర్థిక ప్యాకేజీ ప్ర‌క‌టించిన ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీకి గోవా ప్ర‌జ‌ల త‌రుపున ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్న‌ట్లు పేర్కొన్నారు.  ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo