గురువారం 03 డిసెంబర్ 2020
National - Oct 20, 2020 , 18:29:52

వ్యాక్సిన్ వ‌చ్చే వ‌ర‌కు పోరాటం ఆగొద్దు : ప‌్ర‌ధాని మోదీ

వ్యాక్సిన్ వ‌చ్చే వ‌ర‌కు పోరాటం ఆగొద్దు : ప‌్ర‌ధాని మోదీ

క‌రోనా వ్యాక్సిన్ వ‌చ్చే వ‌ర‌కు మ‌న పోరాటం ఆగొద్ద‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ అన్నారు. ప్ర‌ధాని మోదీ మంగ‌ళ‌వారం సాయంత్రం జాతినుద్దేశించి ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని మాట్లాడుతూ... క‌రోనాతో భార‌త్ పోరాటం చేస్తుంద‌న్నారు. క‌రోనా వ్యాప్తిని మ‌నం స‌మ‌ర్థ‌వంతంగా అడ్డుకోగ‌లిగామ‌న్నారు. క‌రోనా నుంచి మ‌నం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నామ‌న్నారు. మ‌న దేశంలో రిక‌వ‌రీ రేటు ఎక్కువ‌.. మ‌ర‌ణాల రేటు త‌క్కువని తెలిపారు. దేశంలో 10 ల‌క్ష‌ల మందిలో ఐదున్న‌ర వేల మందికే క‌రోనా సోకిందన్నారు. అదే అమెరికా, బ్రెజిల్ వంటి దేశాల్లో 10 ల‌క్ష‌ల మందిలో 25 వేల మందికి సోకిన‌ట్లు వెల్ల‌డించారు. క‌రోనా ప‌రీక్ష‌ల కోసం దేశ‌వ్యాప్తంగా 2 వేల ల్యాబ్‌లు ప‌నిచేస్తున్న‌ట్లు తెలిపారు. దేశంలో 90 ల‌క్ష‌లకు పైగా కొవిడ్ బెడ్లు అందుబాటులో ఉన్న‌ట్లు చెప్పారు. 

క‌రోనా త‌గ్గుముఖం ప‌ట్టింద‌ని నిర్ల‌క్ష్యంగా ఉండొద్ద‌ని సూచించారు. చాలా మంది మాస్కులు లేకుండా బ‌‌య‌ట ‌తిరుగుతున్నారు. మాస్కులు లేకుండా తిరిగితే మీ కుటుంబాన్ని రిస్క్‌లో పెట్టిన‌ట్లేన‌న్నారు. క‌రోనాపై పోరాటం సుదీర్ఘ‌మైందన్నారు. క‌రోనా త‌గ్గింద‌ని భావిస్తే తీవ్ర ప‌రిణామాల‌కు దారితీస్తుందన్నారు. క‌రోనాపై విజ‌యం సాధిస్తున్నాం కాబ‌ట్టి అల‌స‌త్వం ప‌నికిరాదన్నారు. కేసులు త‌గ్గాయి కాబ‌ట్టి క‌రోనా పోయిందని భావించొద్ద‌న్నారు. ఇది పండుగ‌ల సీజ‌న్ మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండాలన్నారు. పండుగ‌ల వేళ ప్ర‌జ‌లు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై ప్ర‌ధాని సూచ‌న‌లు చేశారు. మాస్కు ధ‌రించ‌డం, ఆర‌డుగుల దూరం త‌ప్ప‌నిస‌రిగా పాటించాల‌న్నారు. క‌రోనా వ్యాక్సిన్ వ‌చ్చే వ‌ర‌కు మ‌న పోరాటం ఆగ‌కూడదని ప్ర‌ధాని పేర్కొన్నారు. 

వ్యాక్సిన్ కోసం ప్ర‌పంచం మొత్తం యుద్ధ‌ప్రాతిప‌దిక‌న ప‌నిచేస్తోందన్నారు. క‌రోనా వ్యాక్సిన్ త‌యారీ కోసం శాస్ర్త‌వేత్త‌లు రాత్రింబ‌వ‌ళ్లు ప‌నిచేస్తున్నారన్నారు. కొన్ని వ్యాక్సిన్లు రెండో ద‌శ‌లో, మ‌రికొన్ని మూడో ద‌శ ప్ర‌యోగాల్లో ఉన్న‌ట్లు తెలిపారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌చ్చాక చివ‌రి వ్య‌క్తికి చేరే వ‌ర‌కు ప్ర‌భుత్వం కృషిచేస్తద‌ని చెప్పారు. అగ్నిని, శ‌త్రువును, వ్యాధిని ఎప్పుడూ త‌క్కువ చేసి చూడొద్ద‌న్నారు. వ్యాధికి మందు ల‌భించే వ‌ర‌కు నిర్ల‌క్ష్యంగా ఉండొద్ద‌న్నారు. పండుగ‌ల స‌మ‌యం వ‌చ్చేస్తోంది. ఏ మాత్రం నిర్ల‌క్ష్యం ప‌నికిరాద‌న్నారు. ఏ మాత్రం నిర్ల‌క్ష్యం చేసినా మ‌న జీవితాలు ప్ర‌మాదంలో ప‌డ‌తాయ‌న్నారు. పండుగ‌ల సంతోషం నిరంతరం ఉండాలంటే మ‌నం మ‌రింత జాగ్ర‌త్త‌గా ఉండాలన్నారు. దేశ ప్ర‌జ‌ల‌కు ప్ర‌ధాని ఈ సంద‌ర్భంగా ద‌స‌రా, దీపావ‌ళి శుభాకాంక్ష‌లు తెలిపారు.