ఆదివారం 31 మే 2020
National - May 14, 2020 , 15:40:51

బ‌స్సులన్నీ శానిటైజ్..అంద‌రిని విధుల‌కు ర‌మ్మ‌న్నాం

బ‌స్సులన్నీ శానిటైజ్..అంద‌రిని విధుల‌కు ర‌మ్మ‌న్నాం

చండీగ‌ఢ్ : క‌రోనాను నియంత్రించేందుకు కేంద్రం ఆదేశాల మేర‌కు మే 17 వ‌ర‌కు మూడో ద‌శ లాక్ డౌన్ కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. లాక్ డౌన్ తో ఇప్ప‌టివ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో ప్ర‌జా ర‌వాణా వ్యవ‌స్థ స్తంభించిపోయింది. అయితే జోన్ల వారిగా ప్ర‌జా ర‌వాణాను షురూ చేసేందుకు హ‌ర్యానా స‌న్నాహాలు చేస్తోంది.

హ‌ర్యానా రోడ్‌వేస్ జీఎం ర‌వీంద‌ర్ పాఠ‌క్ మాట్లాడుతూ..ఉద్యోగులంద‌రిని విధుల్లో చేరాల‌ని పిలవ‌డం జ‌రిగింది. అన్ని బ‌స్సుల‌ను శానిటైజ్ చేశాం. బ‌స్సు సీట్ల‌తోపాటు బ‌స్ స్టేష‌న్ లో బెంచీల‌పై సామాజిక దూరం పాటించేలా మార్కింగ్ చేశాం. ప్ర‌భుత్వం జారీ చేసిన మార్గ‌ద‌ర్శ‌కాల‌ను పాటించాల‌ని ప్ర‌యాణికుల‌కు సూచన‌లు చేయ‌నున్న‌ట్లు తెలిపారు. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo