మంగళవారం 26 జనవరి 2021
National - Jan 01, 2021 , 12:44:10

భ‌ద్ర‌తామండ‌లిలో భార‌త్‌కు శాశ్వ‌త స‌భ్య‌త్వం ఇవ్వాలి: ఫ‌్రాన్స్‌

భ‌ద్ర‌తామండ‌లిలో భార‌త్‌కు శాశ్వ‌త స‌భ్య‌త్వం ఇవ్వాలి: ఫ‌్రాన్స్‌

న్యూఢిల్లీ: ‌ఐక్య‌రాజ్య‌స‌మితి భ‌ద్ర‌తామండ‌లికి (యూఎన్ఎస్‌సీ) తాత్కాలిక‌ స‌భ్య‌దేశంగా‌ ఎన్నికైన భార‌త్ ఈ రోజు నుంచి రెండేండ్ల‌పాటు మండ‌లిలో స‌భ్య‌దేశంగా కొన‌సాగ‌నుంది. ఈ నేప‌థ్యంలో ఫ్రాన్స్ భార‌త్‌కు స్వాగ‌తం ప‌లికింది. యునైటెడ్ నేష‌న్స్ సెక్యూరిటీ కౌన్సిల్‌లో భార‌త్‌తో క‌లిసి ప‌నిచేయ‌డానికి తాము ఎంతో ఆతృత‌గా ఎదురుచూస్తున్నామ‌ని ఫ్రాన్స్ తెలిపింది. ఉగ్ర‌వాదంపై పోరు స‌హా వివిధ అంశాల్లో భార‌త్‌తో క‌లిసి ప‌నిచేసే అవ‌కాశం వ‌చ్చినందుకు చాలా సంతోషంగా ఉంద‌ని పేర్కొన్న‌ది. ఈ మేర‌కు భార‌త్‌లో ఫ్రాన్స్ రాయ‌బారి ఇమాన్యుయేల్ లెనైన్ ఒక ప్ర‌క‌ట‌న చేశారు. ఐక్య‌రాజ్య‌స‌మితి భ‌ద్ర‌తామండ‌లిలో భార‌త్‌కు శాశ్వ‌త స‌భ్య‌దేశ హోదా క‌ల్పించాల‌ని, అందుకోసం యూఎన్ఎస్‌సీలో సంస్క‌ర‌ణ చేయాల్సిన అవ‌స‌రం ఉన్న‌ద‌ని త‌న ప్ర‌క‌ట‌న‌లో ఇమాన్యుయేల్‌ అభిప్రాయ‌ప‌డ్డారు.        

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo