శనివారం 06 జూన్ 2020
National - May 08, 2020 , 12:55:48

లాక్‌డౌన్ ఎప్పుడెత్తేస్తారు.. ఎలాంటి వ్యూహాలున్నాయి : రాహుల్ గాంధీ

లాక్‌డౌన్ ఎప్పుడెత్తేస్తారు.. ఎలాంటి వ్యూహాలున్నాయి :  రాహుల్ గాంధీ

హైద‌రాబాద్‌: కేంద్ర ప్ర‌భుత్వ తీరుపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అసంతృప్తి వ్య‌క్తం చేశారు.  ప్ర‌భుత్వం త‌న చ‌ర్య‌ల ప‌ట్ల పార‌ద‌ర్శ‌కంగా ఉండాల‌న్నారు. లాక్‌డౌన్‌ను ఎప్పుడు ఎత్తి వేస్తారు, ఏ అంశాల ఆధారంగా లాక్‌డౌన్ ఎత్తివేత జ‌రుగుతుంద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. వాస్త‌వానికి ఇప్పుడు ప్ర‌భుత్వాల‌ను విమ‌ర్శించే స‌మ‌యం కాదు అని, కానీ లాక్‌డౌన్ ఎత్తివేసేందుకు ఓ ప్ర‌ణాళిక అవ‌స‌రం అని రాహుల్ అన్నారు. రెడ్‌, గ్రీన్‌, ఆరెంజ్ జోన్ల‌తో వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్న‌ట్లు రాహుల్ తెలిపారు. ఈ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని ఆయ‌న అన్నారు. జాతీయ స్థాయిలో జోన్ల విభ‌జ‌న జ‌రిగింద‌ని, అయితే ఆ జోన్ల విభ‌జ‌న ప్ర‌క్రియ జిల్లా మెజిస్ట్రేట్ స్థాయిలో జ‌ర‌గాల‌న్నారు. జాతీయ స్థాయిలో రెడ్ జోన్లుగా ప్ర‌క‌టించిన జిల్లాలు వాస్త‌వానికి గ్రీన్ జోన్లు మాత్ర‌మే అని కాంగ్రెస్ పాలిత సీఎంలు చెబుతున్న‌ట్లు రాహుల్ తెలిపారు.


logo