బుధవారం 03 జూన్ 2020
National - May 17, 2020 , 20:34:55

' 25 మందిని గుర్తించాం..దర్యాప్తు కొనసాగుతుంది '

' 25 మందిని గుర్తించాం..దర్యాప్తు కొనసాగుతుంది '

గుజరాత్ : బీహార్, ఉత్తరప్రదేశ్ కు స్పెషల్ శ్రామిక్ ట్రైన్లు రద్దయ్యాయని, వలస కార్మికులు రాజ్ కోట్ లో ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. రాజ్ కోట్ లోని షాపర్ పారిశ్రామిక  ప్రాంతంలో వలస కూలీలు, కార్మికులు వాహనాలపై రాళ్లు రువ్వారు. వాహనాలు అద్దాలు ధ్వంసమయ్యాయి.

రాజ్ కోట్‌ ఘటనలో ఉద్రిక్త పరిస్థితులకు కారణమైన 25 మందిని గుర్తించామని ఎస్పీ బల్‌ రామ్ మీనా తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతుంది. ఆందోళనలో పాల్గొన్నవారిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo