శనివారం 08 ఆగస్టు 2020
National - Aug 02, 2020 , 13:18:53

సుశాంత్ మరణానికి సంబంధించి ఎలాంటి పత్రాలు ఇవ్వడంలేదు: బీహార్ డీజీపీ

సుశాంత్ మరణానికి సంబంధించి ఎలాంటి పత్రాలు ఇవ్వడంలేదు: బీహార్ డీజీపీ

పాట్నా: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానికి సంబంధించిన పత్రాలను మహారాష్ట్ర పోలీసులు తమకు ఇవ్వడం లేదని బీహార్ డీజీపీ గుప్తేశ్వర్ పాండే ఆరోపించారు. ఈ కేసు దర్యాప్తులో ముంబై పోలీసులు సేకరించిన పోస్ట్‌మార్టం రిపోర్ట్ వివరాలు, సీసీటీవీ ఫుటేజ్, ఇతర సమాచారాన్ని ముంబైకి వెళ్లిన తమ పోలీసులకు వారు ఇవ్వడం లేదన్నారు. ఈ కేసు దర్యాప్తునకు సహకరించడం లేదని ఆయన ఆరోపించారు.

బీహార్‌కు చెందిన సుశాంత్ తల్లిదండ్రులు తమ కుమారుడి ఆత్మహత్యపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన బీహార్ పోలీసులు దర్యాప్తు కోసం ముంబై వెళ్లారు. ఈ నేపథ్యంలో సుశాంత్ కేసు వ్యవహారం మహారాష్ట్ర, బీజేపీలో రాజకీయ రంగు పులుముకున్నది.

logo