సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 18, 2020 , 14:13:06

వైర‌స్‌ సామూహిక వ్యాప్తిని అరిక‌ట్టాలి: కేర‌ళ ఆరోగ్య‌మంత్రి

వైర‌స్‌ సామూహిక వ్యాప్తిని అరిక‌ట్టాలి: కేర‌ళ ఆరోగ్య‌మంత్రి

తిరువ‌నంత‌పురం‌: ‌రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి విస్త‌ర‌ణ‌కు అడ్డుక‌ట్ట వేయాలంటే సామూహిక‌ వ్యాప్తిని అరిక‌ట్టాల్సిన అవ‌స‌రం ఉంద‌ని కేర‌ళ ఆరోగ్యశాఖ మంత్రి కేకే శైల‌జ చెప్పారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో మొత్తం 84 క‌రోనా క్ల‌స్టర్లు ఉన్నాయ‌ని, ఒక క్ల‌స్ట‌ర్ నుంచి మ‌రో క్ల‌స్ట‌ర్‌కు వైర‌స్ వ్యాప్తిచెంద‌కుండా ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని  అన్నారు. అందుకోసం క్ల‌స్ట‌ర్ల‌ను పూర్తిగా లాక్ చేస్తున్నామ‌ని, అత్య‌వ‌స‌ర‌, నిత్యావ‌స‌రాల‌ను ఇండ్ల‌లోకే స‌ర‌ఫ‌రా చేస్తున్నామ‌ని మంత్రి తెలిపారు. 

అయితే, క్ల‌స్ట‌ర్ల లోప‌ల‌ క‌రోనా వైర‌స్ వ్యాప్తి 50 శాతానికి పైగా ఉంద‌ని, క్ల‌స్ట‌ర్ల వెలుప‌ల మాత్రం మ‌హ‌మ్మారి వ్యాప్తి 10 శాతంలోపే ఉంద‌ని మంత్రి శైల‌జ వెల్ల‌డించారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో రాష్ట్రంలో కొత్త క్ల‌స్ట‌ర్లు ఏర్ప‌డ‌కుండా చూడ‌టంతోపాటు, వైర‌స్ సామూహిక వ్యాప్తిని నిరోధించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఆమె అభిప్రాయ‌ప‌డ్డారు. ముఖ్యంగా తీర ప్రాంతాల విష‌యంలో మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండాల్సిన అవ‌స‌రం ఉంద‌ని మంత్రి చెప్పారు.                    

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo