ఆదివారం 17 జనవరి 2021
National - Dec 04, 2020 , 12:32:26

కొద్ది వారాల్లోనే టీకా పంపిణీ పూర్తిచేస్తాం: ఢిల్లీ ప్ర‌భుత్వం

కొద్ది వారాల్లోనే టీకా పంపిణీ పూర్తిచేస్తాం: ఢిల్లీ ప్ర‌భుత్వం

న్యూఢిల్లీ: క‌రోనా వ్యాక్సిన్ పంపిణీకి తాము అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామ‌ని ఢిల్లీ ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. ఈ మేర‌కు ఢిల్లీ ఆరోగ్య‌శాఖ మంత్రి స‌త్యేంద‌ర్ జైన్ ఒక ప్ర‌క‌ట‌న చేశారు. మాకు (ఢిల్లీ ప్ర‌భుత్వానికి) వ్యాక్సిన్ స‌మ‌కూరిన వెంట‌నే చ‌క‌చ‌కా పంపిణీ ప్ర‌క్రియ పూర్తిచేస్తామ‌ని ఆయ‌న చెప్పారు. ఢిల్లీలోని మొహ‌ల్లా క్లినిక్‌లు, పాలీ క్లినిక్‌లు, డిస్పెన్స‌రీలు, ఆస్ప‌త్రుల ద్వారా తాము వ్యాక్సిన్‌ను పంపిణీ చేప‌డుతామ‌ని, కేవ‌లం కొన్ని వారాల వ్య‌వ‌ధిలోనే ఈ పంపిణీ ప్ర‌క్రియ‌ను పూర్తిచేస్తామ‌ని తెలిపారు.  


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.