గురువారం 04 జూన్ 2020
National - May 17, 2020 , 19:06:09

మూడు రోజుల నుంచి ఏమీ తినలేదు..

మూడు రోజుల నుంచి ఏమీ తినలేదు..

న్యూఢిల్లీ: లాక్ డౌన్ తో వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన కార్మికులు ఉత్తరప్రదేశ్‌ లోని సొంతూళ్లకు నడుచుకుంటూ వెళ్తున్నారు. వలసకూలీలు, కార్మికులు ఢిల్లీ-యూపీ సరిహద్దులోని మయూర్ విహార్ ఎక్స్ టెన్షన్ వద్దకు రాగానే పోలీసులు వారిని ఆపేశారు.

 వలస కార్మికురాలు సునీత మాట్లాడుతూ..మేం మూడు రోజుల నుంచి ఏమీ తినలేదు. మా ఊళ్లకు వెళ్తుంటే పోలీసులు ఆపేశారు. మమ్మల్ని వెనక్కి తిరిగి వెళ్లిపోవాలన్నారు. మేం అద్దెకుండే భవనం యజమాని..అద్దె డబ్బులు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. మా రూంకు తాళాలు వేశాడు. నేను ఎక్కడికెళ్లాలి. మేం చాలా ఆకలితో ఉన్నాం. ఒకవేళ కరోనా నుంచి గట్టెక్కితే ఆకలితో చావాల్సిన పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేసింది.

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo