శనివారం 06 జూన్ 2020
National - May 13, 2020 , 15:53:46

'మేం చనిపోయేందుకు రాలేదు..'

'మేం చనిపోయేందుకు రాలేదు..'

ఉత్త‌రప్ర‌దేశ్: లాక్ డౌన్ కొన‌సాగుతున్నా కొంత‌మంది వ‌ల‌స‌కార్మికులు చెన్నైలో గెస్ట్ వ‌ర్క‌ర్లు (యూపీ)గా ప‌నిచేసుకుంటూ ఉన్నారు. మూడో ద‌శ లాక్ డౌన్ కొనసాగుతుండ‌గా..కేంద్ర‌ప్ర‌భుత్వం కార్మికుల‌ను సొంతూళ్ల‌కు పంపించేందుకు ప్ర‌త్యేక రైళ్ల‌ను కూడా ఏర్పాటు చేసింది. దీంతో రైలొస్తే ఇంటికెళ్లొచ్చ‌నుకుని  రైల్వే స్టేష‌న్ కు వెళ్లిన కార్మికుల‌కు నిరాశే ఎదురైంది. చాలా సేపు ఎదురుచూసినా రైలు రాక‌పోవ‌డంతో వ‌ర్క‌ర్లు సైకిళ్ల‌ పై సుమారు 2 వేల కిలోమీట‌ర్ల మేర దూరంలో ఉన్న సొంతూళ్ల‌‌కు బ‌య‌లుదేరారు.

ఓ కార్మికుడు మాట్లాడుతూ..మేం చాలా సేపు ఎదురుచూశాం. రైలు వ‌స్తుందనుకున్నాం. ఇక్క‌డ టైల్స్ ప‌నులు చేశాం. ప్ర‌స్తుతం మాకు తినేందుకు తిండి లేదు. తాము ఇక్క‌డిది చ‌నిపోయేందుకు రాలేద‌ని, అందుకే సైకిళ్లపై బ‌య‌లుదేరుతున్నామ‌ని అన్నాడు. జ‌ర్న‌లిస్ట్ ష‌బ్బీర్ అహ్మ‌ద్ ఈ వీడియోను ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేశారు. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo