మంగళవారం 07 జూలై 2020
National - Jun 22, 2020 , 13:32:23

కరోనా పరీక్షల సంఖ్యను మూడు రెట్లకు పెంచాం : ఢిల్లీ సీఎం

కరోనా పరీక్షల సంఖ్యను మూడు రెట్లకు పెంచాం : ఢిల్లీ సీఎం

న్యూ ఢిల్లీ : కరోనా పరీక్షల సంఖ్యను తాము గతం కంటే మూడు రెట్లు అధికంగా పెంచామని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రివాల్‌ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో రోజుకు 5000 టెస్టులు చేసేవాళ్లమని, ప్రస్తుతం రోజుకు 18000 పరీక్షలు చేస్తున్నామని తెలిపారు. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడొద్దని,  లక్షణాలు కనబడిన వెంటనే ప్రభుత్వ కరోనా టెస్టింగ్‌ సెంటర్‌లో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఢిల్లీలో కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతున్న విషయం తెలిసిందే.  ప్రస్తుతం అక్కడ 56,746 పాజిటివ్‌ కేసులుండగా 31294  మంది డిశ్జార్జి అయ్యారు. 2112 మంది మరణించారు. 


మనం చైనాతో రెండు యుద్ధాలు చేస్తున్నాం..

ఈరోజున మనం చైనాతో రెండు యుద్ధాలు చేస్తున్నామని, ఒకటి బార్డర్‌ ఘర్షణ విషయంలో అయితే మరొకటి కరోనా వైరస్‌పై అని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రివాల్‌ అన్నారు. అత్యంత ధైర్యవంతులైన మా 20 మంది సైనికులు వెనక్కి తగ్గలేదు.. మేము కూడా వెనక్కి తగ్గేది లేదు.. ఈ రెండు యుద్ధాలపై విజయం సాధిస్తామని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. 


హోం ఐసోలేషన్‌లో ఉన్నవాళ్లకు ఆక్సీ మీటర్లు..

హోం ఐసోలేషన్‌లో ఉన్నవాళ్లందరికీ ఆక్సీ మీటర్లను అందజేస్తామని ఢిల్లీ సీఎం అన్నారు.  కొన్ని గంటలకు ఒకసారి మీ ఆక్సిజన్‌ స్థాయిని వాటితో పరీక్ష చేయించుకోవాలని, మీ ఆక్సిజన్‌ స్థాయి సాధారణంగా ఉంటే వాటిని తిరిగి మీరు ప్రభుత్వానికి అందజేయాలని ఆయన సూచించారు. 


logo