గురువారం 09 జూలై 2020
National - Jul 01, 2020 , 13:36:59

క‌రోనాను క‌ట్ట‌డి చేయ‌గ‌లిగాం: కేజ్రివాల్

క‌రోనాను క‌ట్ట‌డి చేయ‌గ‌లిగాం: కేజ్రివాల్

న్యూఢిల్లీ: ఢిల్లీలో క‌రోనా మ‌హ‌మ్మారిని కొంత మేర‌కైనా క‌ట్ట‌డి చేయ‌గ‌లిగామ‌ని సీఎం అర‌వింద్ కేజ్రివాల్ అన్నారు. జూన్ 30 నాటికి ఢిల్లీలో మొత్తం కేసుల సంఖ్య ల‌క్ష మార్కుకు చేరుకుంటుందని, అందులో 60 వేల యాక్టివ్ కేసులు ఉంటాయ‌ని తాము అంచ‌నా వేశామ‌ని, అయితే ఇప్పుడు ఢిల్లీలో కేవ‌లం 26 వేల యాక్టివ్ కేసులు మాత్ర‌మే ఉన్నాయ‌ని ఆయ‌న‌ తెలిపారు. ఢిల్లీలోని ప్ర‌తి ఒక్క‌రి క‌ఠోర శ్ర‌మ వ‌ల్ల‌నే తాము ఈ ఫ‌లితం రాబ‌ట్టామ‌ని, క‌రోనాను నియంత్రించ‌గ‌లిగామ‌ని కేజ్రివాల్ చెప్పారు.  

తాము క‌రోనా టెస్టుల సంఖ్యను కూడా పెంచామ‌ని కేజ్రివాల్ చెప్పారు. అయితే ఇటీవ‌ల ప్ర‌తి 100 టెస్టుల్లో 31 మందికి పాజిటివ్ వ‌చ్చేద‌ని, ఇప్పుడు ప్ర‌తి 100 టెస్టుల్లో స‌గ‌టున 13 మంది మాత్ర‌మే పాజిటివ్ వ‌స్తున్న‌ద‌ని ఆయ‌న వివ‌రించారు. అయితే, ప్ర‌స్తుతం ప‌రిస్థితి మెరుగుప‌డింద‌ని సంతోషంతో చ‌క్క‌లు గుద్దుకునే ప‌రిస్థితి లేద‌ని, క‌రోనా మ‌హ‌మ్మారి ఎప్పుడు ఎలా విజృంభిస్తుందో అంచ‌నా వేయ‌లేమ‌ని చెప్పారు. అందువ‌ల్ల ఇటీవ‌లి కంటే ప‌టిష్టంగా క‌రోనా నియంత్ర‌ణ చ‌ర్య‌లు కొన‌సాగించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని కేజ్రివాల్‌ అభిప్రాయ‌ప‌డ్డారు. 

   ‌


logo